ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎపిఎస్‌ఎస్‌డిసి) ...... చైనా లోని షాంఘై నగరములో వరల్డ్ స్కిల్స్ కాంపిటీషన్ -2022 పోటీలలో పాల్గొనేవారు ఎంపిక లో భాగముగా 2022 జనవరి 6-10 లలో జరిగిన జాతీయస్థాయి నైపుణ్య పోటీల్లో మన రాష్ట్రం తరుఫున పాల్గొని 17 మంది విజేతలుగా నిలిచారు. తిరుపతి కి విచ్చేసినటువంటి శ్రీ సాయికుమార్, ప్రింట్ మీడియా టెక్నాలజీ రంగములో జాతీయ స్థాయి పోటీలలో పాల్గొన్నారు. వీరికి నైపుణ్యాభివృద్ధి సంస్థ చిత్తూరు జిల్లా అధికారి మరియు ఇతర సిబ్బంది స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శ్రీ సాయి కుమార్ మాట్లాడుతూ తన అనుభవాలను , నైపుణ్యాల ఆవశ్యకతను, అవకాశాలను వివరించారు. తాను జిల్లా, ప్రాంతీయ, రాష్ట్ర, జోనల్ పోటీలలో నెగ్గి జాతీయ స్థాయి పోటీలలో పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి నైపుణ్య పోటీల్లో విజయం సాధించినప్పటి నుంచీ ఎపిఎస్‌ఎస్‌డిసి తమకు నిపుణులతో నైపుణ్య శిక్షణ ఇప్పించడంతోపాటు అన్నిరకాల సహాయ సహకారాలు అందించిందన్నారు. ఎపిఎస్‌ఎస్‌డిసి సహకారం, పర్యవేక్షణతోనే తాము జాతీయస్థాయి నైపుణ్య పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటగలిగామని అభిప్రాయపడ్డారు
