#SkillAP_APSSDC ##Skill_India




**SKILLAP/APSSDC &*
*MICROSOFT**
**************************
రాష్ట్రంలోని యువతలో startups/ ఆవిష్కరణల పట్ల ఉన్న ఆసక్తిని, ఉత్సాహాన్ని పెంపొందిచడం కోసం ఎన్ఎస్డిసి, మైక్రోసాఫ్ట్ సంస్థతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎపిఎస్‌ఎస్‌డిసి) పనిచేస్తున్నది

ఈ మేరకు కలలు కనండి (dream it) ప్రణాళిక సిద్ధం చేసుకోండి (Build It), సాధించండి (Live it) అన్న నినాదంతో ఎన్ఎస్డిసి, మైక్రోసాఫ్ట్ సంస్థ చేపట్టిన ఇండియా చాంపియన్ షిప్ పోటీలను ఆన్ లైన్ ద్వారా ప్రారంభించడం అయినది.

మైక్రోసాఫ్ట్ ఆధ్వర్యంలో జరిగే ఈ పోటీలను టెక్నాలజీలో ఒలంపిక్ పోటీలతో పోలుస్తారు

నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, మైక్రోసాప్ట్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ పోటీలకు మన రాష్ట్రం నుంచి కూడా జాతీయస్థాయి పోటీలకు ఎక్కువ మంది పాల్గొనేలా ఎపిఎస్‌ఎస్‌డిసి కృష్టి చేస్తుంది.

నాలుగు వేల మంది యువకులు ప్రస్తుతం ఈ పోటీలకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు

ప్రపంచస్థాయిలో విజేతలుగా నిలిచిన వారికి 75వేల డాలర్లు బహుమతితోపాటు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల మెంటార్షిప్ పొంద వచ్చు.

ఈ పోటీల్లో పాల్గొనడం ద్వారా యువతలో ఉన్న సృనాత్మకత బయటకు రావడం, ఇండస్ట్రీ 4.0 స్కిల్స్ ను ప్రదర్శించే అవకాశంతోపాటు ఆవిష్కరణలపై యువతలో ఆసక్తి పెంచుకోవడానికి అంతర్జాతీయస్థాయి వేదికను అందించడమే ఈ మైక్రోసాఫ్ట్ ఇమాజిన్ కప్ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశ్యం.

ఈ పోటీల్లో పాల్గొనేవారు మైక్రోసాప్ట్ టూల్స్ ను ఉపయోగించి *జీవనశైలి* , *ఆరోగ్యం* , *చదువు* , *భూమి* అనే నాలుగు అంశాలపై మానవాళి ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి ప్రయత్నించాల్సి ఉంటుంది. 16ఏళ్ల వయస్సు పైబడిన వారందరూ మైక్రోసాఫ్ట్ ఇమాజిన్ కప్ లో పాల్గొనేందుకు అర్హులే. ఆసక్తి ఉన్నవారు ఈనెల 31వ తేదీలోపు https://imaginecup.microsoft.com/en-us/category/16?skillLevel=0 లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

మేధస్సుకు పదును పెట్టే ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువత అందరూ పాల్గొనే విధంగా చర్యలు తీసుకుంటున్నాము.
****************************
*డాక్టర్ అర్జా శ్రీకాంత్*

Comments

Popular posts from this blog

*పత్రికా ప్రకటన* 24-02-2024, తిరుపతి. విషయము: *తిరుపతి లో 27-02-2024 తేదీ న మినీ జాబ్ మేళా నిర్వహించబడును.* *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 27-02-2024 అనగా మంగళవారం నాడు ఉదయం 9 గంటల నుంచి ఎస్ వి సి సి డిగ్రీ కళాశాల(SVCC Degree College), బాలాజీ కాలనీ, తిరుపతి నందు పదవ తరగతి లేదా ఇంటర్మీడియట్ లేదా ఐటిఐ లేదా డిప్లమో లేదా ఏదైనా డిగ్రీ లో ఉత్తీర్ణత సాధించిన యువతీ యువకులకు మినీ జాబ్ మేళా నిర్వహించబడును.* ఈ మినీ జాబ్ మేళాకు హాజరయ్యే కంపెనీల వివరములు: 1: *Just Dail* లో ఉద్యోగాల కొరకు ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత అయిన యువకులు అర్హులు. 2: *Apollo Pharmacy* లో ఉద్యోగాల కొరకు ఇంటర్ లేదా ఫార్మసీ చదువుకున్న యువతీ యువకులు అర్హులు. 3: *Dixon Technologies India Pvt Ltd* లో ఉద్యోగాల కొరకు పదవ తరగతి లేదా ఇంటర్మీడియట్ లేదా ఐటిఐ లేదా ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించిన యువతీ యువకులు అర్హులు. 4: *Bigc Mobiles* లో ఉద్యోగాల కొరకు పదవ తరగతి లేదా ఇంటర్మీడియట్ లేదా ఐటిఐ లేదా ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించిన యువతీ యువకులు అర్హులు. 5: *Muthoot Group* లో ఉద్యోగాల కొరకు ఏదైనా డిగ్రీ లో ఉత్తీర్ణత సాధించిన యువతీ యువకులు అర్హులు. 6:*Iskon* లో ఉద్యోగాల కొరకు ఇంటర్మీడియట్ లేదో ఏదైనా డిగ్రీలో పుట్టింది సాధించిన యువకులు అర్హులు. మరిన్ని వివరములకు క్రింద తెలుపబడిన రిజిస్ట్రేషన్ లింకులో ఆధార్ ఓటిపి తో తప్పనిసరిగా నమోదు చేసుకోవలెను. రిజిస్ట్రేషన్ లింక్: https://skilluniverse.apssdc.in సంప్రదించవలసిన మొబైల్ నెంబర్:9177508279,8074919939. కావున ఈ మినీ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి జిల్లా నైపుణ్యాభిృద్ధి సంస్థ అధికారి ఆర్ లోకనాథం గారు మరియు ఎస్విసిసి డిగ్రీ కళాశాల, ప్రిన్సిపాల్ శ్రీ నాగరాజ గారు సంయుక్తం గా ఒక ప్రకటనలో తెలియజేశారు. ధన్యవాదములు ఆర్ లోకనాథం, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభిృద్ధి సంస్థ, తిరుపతి జిల్లా.

#SkillAP_APSSDC