#SkillAP_APSSDC


*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎపిఎస్‌ఎస్‌డిసి)*

*స్కిల్ ఏపీ మిషన్- ఎపిఎస్‌ఎస్‌డిసి*
రాష్ట్రంలోని విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణతోపాటు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎపిఎస్‌ఎస్‌డిసి) పనిచేస్తోంది. పాఠశాల స్థాయి నుంచి డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ వరకు అనేక నైపుణ్య శిక్షణా కార్యక్రమాలతోపాటు, మార్కెట్ లో డిమాండ్ ఉన్న కోర్సుల్లో శిక్షణ ఇస్తోంది. శిక్షణ పొందిన వారు ఉద్యోగాలు పొందడంలో అవసరమైన సహకారం అందిస్తోంది.

కోవిడ్ మమమ్మారి సృష్టించిన అలజడి కారణంగా జనజీవనం మొత్తం స్తంభించిపోయింది. ఎపిఎస్‌ఎస్‌డిసి అమలు చేస్తున్న శిక్షణా కార్యక్రమాలు కూడా ఆగిపోయాయి. అయితే విద్యార్థులు, నిరుద్యోగ యువతకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా ఆన్ లైన్, వర్చువల్ విధానం ద్వారా శిక్షణా కార్యక్రమాలను కొనసాగించడం జరిగింది. ఇప్పటి వరకు నిర్వహించిన ఆన్ లైన్ శిక్షణా కార్యక్రమాల ద్వారా సుమారు 1.7 లక్షల మంది లబ్ధి పొందారు.

ఏడాది గా ఎపిఎస్‌ఎస్‌డిసి అమలు చేసిన కార్యక్రమాల వివరాలు:

*నాన్ అకడమిక్ విభాగం:*

1. *ప్రైమరీ సెక్టార్:* వ్యవసాయం దాని అనుబంధ రంగాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రగతిశీల రైతులు, నిరుద్యోగ యువతకు అందించడం జరుగుతోంది.

• 2020 వరకు: 5310 మంది
• 2021కి ప్రణాళిక: 10000 మంది

2. *నర్సులకు శిక్షణ:* కోవిడ్-19 విపత్తును ఎదుర్కొనేందుకు ఆరోగ్యశాఖతో కలిసి నర్సులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం జరిగింది.
• 2020 వరకు: 3300 మంది
• 2021కి ప్రణాళిక: 5000 మంది

3. *గిరిజన యువత:* గిరిజన యువతలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచేలా నెట్వర్కింగ్, ఎంఎస్ ఆఫీస్, కంప్యూటర్ ఫండమెంటల్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వడం జరిగింది.
• 2020 వరకు: 900 మంది
• 2021కి ప్రణాళిక: 2000 మంది

4. *మహిళల కోసం ప్రత్యేక శిక్షణలు:* గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు ఫేస్ బుక్ తో కలిసి డిజిటల్ భేటీ, గోల్ లాంటి కోర్సుల ద్వారా డిజిటల్ అక్షరాస్యత పెంచడం కోసం శిక్షణ ఇవ్వడం జరిగింది.
• 2020 వరకు: 4700 మంది
• 2021కి ప్రణాళిక: 10000 మంది

5. *కేంద్ర ప్రభుత్వ పథకాలు:* కేంద్ర ప్రభుత్వం పథకాలైన పీఎంకెవీవై, ఈ.ఎస్.డి.ఎం, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ సంబంధిత స్కీమ్స్ ను కూడా ఎపిఎస్‌ఎస్‌డిసి సమర్థవంతంగా అమలు చేస్తోంది. ఈ శిక్షణా కార్యక్రమాలన్నీ కోవిడ్ కు ముందు ప్రారంభించడం జరిగింది. పీఎంకేవీవై స్కీమ్ కింది శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది.
• 2020 వరకు: 5000 మంది (శిక్షణ కొనసాగుతోంది)
• 2021కి ప్రణాళిక: 30,000 మంది

6. *స్కిల్ కనెక్ట్ డ్రైవ్ లు (ఆన్ లైన్ ద్వారా):* ఆన్ లైన్ ద్వారా నిరుద్యోగ యువత, ఉద్యోగాలు ఇచ్చే సంస్థల ప్రతినిధులతో కలిపి ఉద్యోగాలు కల్పించడం జరిగింది.

• 2020 వరకు: 1515 మంది
• 2021కి ప్రణాళిక: 50,000 మంది

7. *పరిశ్రమల ఆధారిత నైపుణ్య శిక్షణ మరియు ఉపాధి:* స్థానిక యువతకు స్థానికంగా ఉండే పరిశ్రమల్లోనే శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించాలన్న గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచనల ప్రకారం పరిశ్రమల ఆధారిత నైపుణ్య శిక్షణ మరియు ఉపాధి పేరుతో శిక్షణా కార్యక్రమాలను ప్రారంభించడం జరిగింది. పరిశ్రమల ఆవరణలోనే శిక్షణ ఇచ్చి.. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసిన వారిని అక్కడే ఉద్యోగాల్లోకి తీసుకోవడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్ధేశ్యం. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 220 కంపెనీలను పరిశ్రమల ఆధారిత నైపుణ్య శిక్షణ మరియు ఉపాధి కార్యక్రమం కింద సంప్రదించడం జరిగింది. 90 కంపెనీలు శిక్షణ ఇచ్చేందుకు అంగీకరించాయి. ఇందులో 23 కంపెనీల్లో శిక్షణ పూర్తి చేయడంతోపాటు 602 మంది ఉద్యోగాలు పొందారు. డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, అరబిందో ఫార్మా, రాంకీ ఫార్మా, ఆల్స్ట్రామ్, ఇసుజు, గ్రీన్ టెక్, జేబీఎం, దాల్మియా సిమెంట్స్, కల్లం టెక్స్ టైల్స్, వర్డాంత్ లైఫ్ సైన్సెస్, సోనిక్ ఫార్మా, వసుధ ఫార్మా, శ్రీసిటీ, మోహన్ టెక్స్ టైల్స్ తదితర సంస్థలు.

• 2020 వరకు: 602 మందికి ఉద్యోగాలు వచ్చాయి. (మరో 200 మందికి శిక్షణ పొందుతున్నారు)  
• 2021కి ప్రణాళిక: 25,000 మంది

8. *పరిశ్రమలతో అనుసంధానం:* పరిశ్రమల్లో వివిధ ఉద్యోగాల వివరాలను తెలుసుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలో స్కిల్ ఎకోసిస్టమ్ ను అభివృద్ధి చేయడానికి వీలుగా మరో 40 ప్రముఖ సంస్థలు ఒప్పందాలు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే  
20  ప్రముఖ సంస్థలతో ఒప్సందాలు చేసుకోవడం జరిగింది. (దాల్మియా భారత్ ఫౌండేషన్, నేషనల్ రీసెర్చ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఎన్ఎస్ఈ అకడామి, డెల్ టెక్నాలజీస్, జేబీఎం ఆటో లిమిటెడ్, సీఐఐ ఇనిస్టిట్యూట్ ఆఫ్ లాగిస్టిక్స్, ఐబిఎం ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఎల్వీ ప్రసాద్ ఫిల్మ్ అండ్ టీవీ అకాడమి, ఇండియా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్, సింగపూర్ పాలిటెక్నిక్ ఇంటర్నేషనల్). 
స్కిల్ కాలేజీల నిర్మాణం కోసం అవసరమైన సహకారం అందించేవారితోపాటు పెట్టుబడిదారులను తీసుకురావడం.

9. *ఎంట్రప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్:* 
• రాష్ట్రంలో ఉండే పేద చేతివృత్తులవారు మరియు హస్తకళా కార్మికులు స్థానికంగా తయారు చేసే ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వడం మరియు వారికి జీవనోపాధి కల్పించడం.
• వెనుకబడిన మరియు ఇప్పటికే ముందుకు సాగుతున్న వారిని ప్రోత్సహించేందుకు ప్రత్యేక ఛానెల్‌ను ఏర్పాటు చేయడం జరిగింది.
• స్థానికంగా ఉండే హస్తకళాకారులు తయారు చేసిన తమ ఉత్పత్తులను ఈ కామర్స్ బిజినెస్ లో అమ్ముకునేలా ఫ్లిప్ కార్ట్, టీవీజీ గ్రూప్ లతో కలిసి పనిచేయడం జరుగుతోంది. 

*అకడమిక్ విభాగం:*

1. *విద్యార్థుల కోసం శిక్షణ కార్యక్రమాలు:* డసాల్ట్, సీమెన్స్ లాంటి ప్రముఖ సంస్థలతో కలిసి ఆన్ లైన్ శిక్షణల ద్వారా విద్యార్థులు లబ్ధిపొందడం జరిగింది.

• 2020 వరకు: 1.5 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందారు.
• 2021కి ప్రణాళిక: 50,000 మంది

2. *ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్:* 

ఇండస్ట్రీ 4.0లో భాగంగా వివిధ ఆన్ లైన్ టెక్నాలజీలపై అధ్యాపకులకు శిక్షణ ఇవ్వడం జరిగింది.
• 2020 వరకు: 30,000 మంది అధ్యాపకులు లబ్ధి పొందారు  
• 2021కి ప్రణాళిక: 50,000 మంది

 *స్కిల్ యూనివర్సిటీ, స్కిల్ కాలేజీలు*

• స్థానికంగా ఉండే పరిశ్రమల్లో 75శాతం ఉద్యోగాలు స్థానికంగా ఉండే యువతకు కల్పించాలని ముఖ్యమంత్రిగారు సంకల్పించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసింది. 
• స్కిల్ యూనివర్సిటీ, స్కిల్ కాలేజీల ఏర్పాటులో ఎపిఎస్‌ఎస్‌డిసి నిమగ్నమైంది. ఇప్పటి వరకు ఈ కింద ఇవ్వబడిన చర్యలు తీసుకోవడం జరిగింది. 

 స్కిల్ యూనివర్సిటీ, స్కిల్ కాలేజీల నిర్మాణం కోసం అవసరమైన భూమిని గుర్తించడం
 డిజైన్లు, లేఔట్లను తయారు 
 కోర్సులు, పాఠ్యాంశాలను రూపొందించడం
 ఆర్థికపరమైన అంశాలు

*2021 ప్రణాళిక:*

పరిశ్రమల్లో పనిచేయడానికి అవసరమైన విధంగా స్థానిక యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలన్న ముఖ్యమంత్రిగారి లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్రంలో బలమైన నైపుణ్య వ్యవస్థను (స్కిల్ ఎకోసిస్టమ్) ఏర్పాటు చేయడం కోసం ఎపిఎస్‌ఎస్‌డిసి నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది.

 ముఖ్యమంత్రి గారి లక్ష్యాన్ని సాధించడం కోసం ఈ కింది ప్రణాళిక సిద్ధం చేసుకోవడం జరిగింది.

• స్కిల్ యూనివర్సిటీతోపాటు 30 స్కిల్ కాలేజీలు ఏర్పాటు చేయడం

• వివిధ ఇండస్ట్రీ క్లస్టర్ల సహకారంతో మరిన్ని పరిశ్రమల ఆధారిత నైపుణ్య శిక్షణ మరియు ఉపాధి కార్యక్రమాలను ప్రారంభించడం

• ఇండస్ట్రీ 4.0, 21వ శతాబ్ధపు శిక్షణలను వివిధ జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో కలిసి ఎపిఎస్‌ఎస్‌డిసి ద్వారా అందించడం.

• లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఎల్.ఎం.ఎస్) ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి పరిశ్రమలకు చెందిన పలువురు ప్రముఖులు రూపొందించిన మాడ్యూల్స్, నాణ్యమైన కంటెంట్ రాష్ట్రంలోని విద్యార్థులు, నిరుద్యోగ యువతకు అందుబాటులో ఉంచడం.

• జీవో నెంబర్ 50 ప్రకారం రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖలు అమలు చేస్తున్న నైపుణ్య శిక్షణా కార్యక్రమాలన్నింటినీ ఎపిఎస్‌ఎస్‌డిసి ఒక నోడల్ ఏజెన్సీగా ఉంటూ పర్యవేక్షించడం.
 
• స్కిల్ ఇండియా పోర్టల్ తరహాలోనే రాష్ట్రంలో అమలు చేస్తున్న నైపుణ్య శిక్షణా కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని అంతా ఒక్కచోట ఉంచేలా స్కిల్ ఏపీ పోర్టల్ ను రూపొందించడం.

• అప్రెంటీస్ షిప్ ద్వారా ఉపాధి అవకాశాలు యువత పొందేలా న్యాప్స్ కార్యక్రమాన్ని అమలు చేయడం

• *ప్రాథమిక రంగంలో శిక్షణ:*

 వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై ప్రత్యేక శ్రద్ధ ఉంచి నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను అమలు చేయడం. ముఖ్యంగా ప్రగతిశీల రైతులకు వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం. ఆక్వా రంగంలో సీవీడ్, సోలార్ డ్రైయింగ్ లాంటి విభాగాల్లో నైపుణ్య శిక్షణ ఇవ్వడం.

• మ్యానుఫ్యాశ్చరింగ్ రంగంలో ఉన్న డిమాండ్ కు అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం కోసం జేబీఎం లాంటి ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు చేసుకుని శిక్షణ కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం జరిగింది. 

• ఇంటర్మీడియ్ బోర్డు సహకారంతో ఇంటర్ చదవుతున్న విద్యార్థులకు పర్సనాలిటీ డెవలప్మెంట్, ఇంగ్లీష్ ప్రావీణ్యం అంశాలపై శిక్షణను త్వరలోనే ప్రారంభించడం జరుగుతుంది.

• గ్రామ, వార్డు సచివాలయం విభాగంలోని  గ్రామ వాలంటీర్లకు ప్రాథమిక నైపుణ్యాలపై శిక్షణ అందించబడుతుంది. తద్వారా ప్రభుత్వం పథకాలను సమర్థవంతంగా అమలు చేయడానికి నైపుణ్యాలు ఉపయోగపడతాయి. ఇక వ్యవసాయ శాఖతో కలిసి రైతు భరోసా కేంద్రం వంటి కార్యక్రమాలు ఆఫర్ చేస్తారు.

• రహదారులు మరియు సంబంధిత సౌలభ్యాలను మెరుగుపరచడానికి పర్యాటక అభివృద్ధిశాఖ, హైవే అథారిటీస్ తో కలిసి నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని తయారు చేయడం.  

•  మైనారిటీ యువతకు కూడా నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ఇప్పటికే మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ ఆఫైర్స్ శాఖకు ప్రతిపాదనలు పంపడం జరిగింది.

• మహిళలు స్వయం ఉపాధి పొందడం, వారి జీవనానికి ఎలాంటి ఇబ్బంద కలకుండా ఉపాధి పొందేలా నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు అమలు చేయడం

• *విదేశాల్లో ఉద్యోగాలు: గ్లోబల్ లెర్నింగ్ ప్రోగ్రామ్* 

ద్వారా రాష్ట్రంలోని నర్సింగ్ విద్యార్థులకు శిక్షణ ఇచ్చి యుకెలో ఉద్యోగాలు పొందేలా చేయడం. అంతేకాకుండా విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి అవసరమైన సహకారాన్ని గ్లోబల్ స్కిల్ ట్రైనింగ్ సెల్ ఏర్పాటు చేయడం జరిగింది. 

 *ఓవర్సీస్ మ్యాన్ పవర్*  కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద్వారా విదేశఆల్లో మంచి ఉద్యోగాలు పొందేలా చేయడం. అనేక ఉద్యోగాలున్నా కోవిడ్ కారణంగా నిలిచిపోయాయి. 

• ఎంట్రప్రెన్యూర్షిప్ ను మరింత ప్రమోట్ చేయడంలో భాగంగా వస్తువు ఉత్పత్తి అయినప్పటి నుంచి అమ్మకం వరకు అవసరమైన సహకారం అదించడం

• గ్రామీణ ప్రాంతాల్లోని యువతలో ఆధునిక సాంకేతిక అంశాలపై అవగాహన కల్పించడం కోసం ‘స్కిల్స్ ఆన్ వీల్స్’ అమలు చేస్తున్నాము. 

• పనిచేస్తున్న వారికి అదనపు నైపుణ్యాలు కల్పించడం కోసం ఆర్పీఎల్ పేరుతో నైపుణ్య శిక్షణ ఇవ్వడం జరుగుతోంది. 

•  *మ్యాసివ్ ఓపెన్ ఆన్ లైన్ క్లాసెస్* (మూక్స్) టూల్స్ ను ఉపయోగించి గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు కూడా లబ్ధి కలిగేలా ఎపిఎస్‌ఎస్‌డిసి శిక్షణా కార్యక్రమాల ప్రణాళిక

• ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ అఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (ఏపీ ఉన్నత విద్యామండలి) తో కలిసి రెగ్యులర్ అకడమిక్ విభాగంలో నైపుణ్య విభాగాన్ని చేర్చడంతోపాటు డిమాండ్ ఉన్న రంగాల్లో నైపుణ్య కోర్సులను అమలు చేయడానికి ప్రణాళిక.

రాబోయే సంవత్సర కాలంలో సమాజాన్ని మరింత ప్రభావితం చేసే నైపుణ్య కార్యక్రమాలు ద్వారా యువతకు మరింత దగ్గరయ్యేందుకు నైపుణ్యాభివృద్ధి సంస్థ కృషి చేస్తుంది. 

గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు యోచన మేర  పరిశ్రమలకు కావలసిన నైపుణ్య ము తో కూడిన  యువతను అందించే దిశగా APSSDC అడుగులు వేస్తోంది. 
****************************
 *డాక్టర్ ఆర్జా శ్రీకాంత్* 
స్పెషల్ సెక్రటరీ టు గవర్నమెంట్
ఎండీ అండ్ సి ఓ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్

Comments

Popular posts from this blog

*పత్రికా ప్రకటన* 24-02-2024, తిరుపతి. విషయము: *తిరుపతి లో 27-02-2024 తేదీ న మినీ జాబ్ మేళా నిర్వహించబడును.* *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 27-02-2024 అనగా మంగళవారం నాడు ఉదయం 9 గంటల నుంచి ఎస్ వి సి సి డిగ్రీ కళాశాల(SVCC Degree College), బాలాజీ కాలనీ, తిరుపతి నందు పదవ తరగతి లేదా ఇంటర్మీడియట్ లేదా ఐటిఐ లేదా డిప్లమో లేదా ఏదైనా డిగ్రీ లో ఉత్తీర్ణత సాధించిన యువతీ యువకులకు మినీ జాబ్ మేళా నిర్వహించబడును.* ఈ మినీ జాబ్ మేళాకు హాజరయ్యే కంపెనీల వివరములు: 1: *Just Dail* లో ఉద్యోగాల కొరకు ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత అయిన యువకులు అర్హులు. 2: *Apollo Pharmacy* లో ఉద్యోగాల కొరకు ఇంటర్ లేదా ఫార్మసీ చదువుకున్న యువతీ యువకులు అర్హులు. 3: *Dixon Technologies India Pvt Ltd* లో ఉద్యోగాల కొరకు పదవ తరగతి లేదా ఇంటర్మీడియట్ లేదా ఐటిఐ లేదా ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించిన యువతీ యువకులు అర్హులు. 4: *Bigc Mobiles* లో ఉద్యోగాల కొరకు పదవ తరగతి లేదా ఇంటర్మీడియట్ లేదా ఐటిఐ లేదా ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించిన యువతీ యువకులు అర్హులు. 5: *Muthoot Group* లో ఉద్యోగాల కొరకు ఏదైనా డిగ్రీ లో ఉత్తీర్ణత సాధించిన యువతీ యువకులు అర్హులు. 6:*Iskon* లో ఉద్యోగాల కొరకు ఇంటర్మీడియట్ లేదో ఏదైనా డిగ్రీలో పుట్టింది సాధించిన యువకులు అర్హులు. మరిన్ని వివరములకు క్రింద తెలుపబడిన రిజిస్ట్రేషన్ లింకులో ఆధార్ ఓటిపి తో తప్పనిసరిగా నమోదు చేసుకోవలెను. రిజిస్ట్రేషన్ లింక్: https://skilluniverse.apssdc.in సంప్రదించవలసిన మొబైల్ నెంబర్:9177508279,8074919939. కావున ఈ మినీ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి జిల్లా నైపుణ్యాభిృద్ధి సంస్థ అధికారి ఆర్ లోకనాథం గారు మరియు ఎస్విసిసి డిగ్రీ కళాశాల, ప్రిన్సిపాల్ శ్రీ నాగరాజ గారు సంయుక్తం గా ఒక ప్రకటనలో తెలియజేశారు. ధన్యవాదములు ఆర్ లోకనాథం, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభిృద్ధి సంస్థ, తిరుపతి జిల్లా.

#SkillAP_APSSDC