ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ వారి ఆధ్వర్యంలో స్థానిక ఎస్ డి హెచ్ ఆర్ డిగ్రీ కళాశాల, న్యూ బాలాజీ కాలనీ, ఎయిర్ బైపాస్ రోడ్, తిరుపతి నందు 23-12-2021 న మెగా స్కిల్ & జాబ్ మేళా నిర్వహించబడుతున్నది ఈ మెగా స్కిల్ అండ్ జాబ్ మేళాలో సుమారుగా 31 సంస్థలు పాల్గొంటున్నాయి, దాదాపు 3100 ఖాళీలు ఉన్నాయి. ఈ సంస్థలలో ఉద్యోగానికి కనీస అర్హతలు గా పదవ తరగతి నుండి ఇంటర్మీడియట్, డిప్లమా, డిగ్రీ, బీటెక్ మరియు పి జి పూర్తి చేసి 18 నుండి 35 సంవత్సరాలు లోపల ఉన్న యువతీ యువకులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చును. ఈ మెగా స్కిల్ అండ్ జాబ్ మేళాలో భాగంగా నిరుద్యోగ యువతీ యువకులకు నియామకాలలో విజయం సాధించడానికి రెజ్యూమ్ రైటింగ్, పర్సనాలిటీ స్కిల్స్ డెవలప్మెంట్, ఇంటర్వ్యూ స్కిల్స్ పై మూడు రోజులు(20-12-2021 నుండి 22-12- 2021 వరకు) శిక్షణ కూడా ఇవ్వనున్నారు, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ముందుగా స్థానిక ఎస్ డి హెచ్ ఆర్ డిగ్రీ కళాశాల నందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పారు. ఈ మెగా స్కిల్ అండ్ జాబ్ మేళా లో పాల్గొనదలచిన నిరుద్యోగ యువత ముందుగా apssdc.in వెబ్ సైట్ నందు తమ వివరాలను నమోదు చేసుకొని, 23-12-2021 వ తేదీన అడ్మిట్ కార్డ్ తో పాటు వారి Bio-Data, ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్ జెరాక్స్ సెట్స్ తగినని మరియు ఇతర సర్టిఫికెట్స్ ను తీసుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి తెలియజేశారు. మరిన్ని వివరాలకై 938110908, 9493923124, 8121984014, 8886086072 ను సంప్రదించండి.



Comments

Popular posts from this blog

*పత్రికా ప్రకటన* 24-02-2024, తిరుపతి. విషయము: *తిరుపతి లో 27-02-2024 తేదీ న మినీ జాబ్ మేళా నిర్వహించబడును.* *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 27-02-2024 అనగా మంగళవారం నాడు ఉదయం 9 గంటల నుంచి ఎస్ వి సి సి డిగ్రీ కళాశాల(SVCC Degree College), బాలాజీ కాలనీ, తిరుపతి నందు పదవ తరగతి లేదా ఇంటర్మీడియట్ లేదా ఐటిఐ లేదా డిప్లమో లేదా ఏదైనా డిగ్రీ లో ఉత్తీర్ణత సాధించిన యువతీ యువకులకు మినీ జాబ్ మేళా నిర్వహించబడును.* ఈ మినీ జాబ్ మేళాకు హాజరయ్యే కంపెనీల వివరములు: 1: *Just Dail* లో ఉద్యోగాల కొరకు ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత అయిన యువకులు అర్హులు. 2: *Apollo Pharmacy* లో ఉద్యోగాల కొరకు ఇంటర్ లేదా ఫార్మసీ చదువుకున్న యువతీ యువకులు అర్హులు. 3: *Dixon Technologies India Pvt Ltd* లో ఉద్యోగాల కొరకు పదవ తరగతి లేదా ఇంటర్మీడియట్ లేదా ఐటిఐ లేదా ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించిన యువతీ యువకులు అర్హులు. 4: *Bigc Mobiles* లో ఉద్యోగాల కొరకు పదవ తరగతి లేదా ఇంటర్మీడియట్ లేదా ఐటిఐ లేదా ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించిన యువతీ యువకులు అర్హులు. 5: *Muthoot Group* లో ఉద్యోగాల కొరకు ఏదైనా డిగ్రీ లో ఉత్తీర్ణత సాధించిన యువతీ యువకులు అర్హులు. 6:*Iskon* లో ఉద్యోగాల కొరకు ఇంటర్మీడియట్ లేదో ఏదైనా డిగ్రీలో పుట్టింది సాధించిన యువకులు అర్హులు. మరిన్ని వివరములకు క్రింద తెలుపబడిన రిజిస్ట్రేషన్ లింకులో ఆధార్ ఓటిపి తో తప్పనిసరిగా నమోదు చేసుకోవలెను. రిజిస్ట్రేషన్ లింక్: https://skilluniverse.apssdc.in సంప్రదించవలసిన మొబైల్ నెంబర్:9177508279,8074919939. కావున ఈ మినీ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి జిల్లా నైపుణ్యాభిృద్ధి సంస్థ అధికారి ఆర్ లోకనాథం గారు మరియు ఎస్విసిసి డిగ్రీ కళాశాల, ప్రిన్సిపాల్ శ్రీ నాగరాజ గారు సంయుక్తం గా ఒక ప్రకటనలో తెలియజేశారు. ధన్యవాదములు ఆర్ లోకనాథం, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభిృద్ధి సంస్థ, తిరుపతి జిల్లా.

#SkillAP_APSSDC