Skill Ap AP SKILL DEVELOPMENT Apssdc Chittoor ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ వారి ఆధ్వర్యంలో స్థానిక ఎస్ డి హెచ్ ఆర్ డిగ్రీ కళాశాల, న్యూ బాలాజీ కాలనీ, ఎయిర్ బైపాస్ రోడ్, తిరుపతి నందు 23-12-2021 న మెగా స్కిల్ & జాబ్ మేళా నిర్వహించబడుతున్నది ఈ మెగా స్కిల్ అండ్ జాబ్ మేళాలో సుమారుగా 27 సంస్థలు పాల్గొంటున్నాయి, దాదాపు 2700 ఖాళీలు ఉన్నాయి. ఈ సంస్థలలో ఉద్యోగానికి కనీస అర్హతలు గా పదవ తరగతి నుండి ఇంటర్మీడియట్, డిప్లమా, డిగ్రీ, బీటెక్ మరియు పి జి పూర్తి చేసి 18 నుండి 35 సంవత్సరాలు లోపల ఉన్న యువతీ యువకులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చును. ఈ మెగా స్కిల్ అండ్ జాబ్ మేళాలో భాగంగా నిరుద్యోగ యువతీ యువకులకు నియామకాలలో విజయం సాధించడానికి రెజ్యూమ్ రైటింగ్, పర్సనాలిటీ స్కిల్స్ డెవలప్మెంట్, ఇంటర్వ్యూ స్కిల్స్ పై మూడు రోజులు(20-12-2021 నుండి 22-12-2021 వరకు) శిక్షణ కూడా ఇవ్వనున్నారు, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ముందుగా స్థానిక ఎస్ డి హెచ్ ఆర్ డిగ్రీ కళాశాల నందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పారు. ఈ మెగా స్కిల్ అండ్ జాబ్ మేళా లో పాల్గొనదలచిన నిరుద్యోగ యువత ముందుగా apssdc.in వెబ్ సైట్ నందు తమ వివరాలను నమోదు చేసుకొని, 23-12-2021 వ తేదీన అడ్మిట్ కార్డ్ తో పాటు వారి Bio-Data, ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్ జెరాక్స్ సెట్స్ తగినని మరియు ఇతర సర్టిఫికెట్స్ ను తీసుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి తెలియజేశారు. మరిన్ని వివరాలకై 938110908, 9493923124, 8121984014, 8886086072 ను సంప్రదించండి.
Comments
Post a Comment